Palnaduinfo

Palnaduinfo Capital of Palnadu Palnadu (Telugu: పల్నాడు) is the northern region of Guntur District in the Indian state of Andhra Pradesh.

Also known as PALLAVA NADU, it occupies an important place in Telugu history. After the decline of the Satavahana dynasty, the Pallavas became independent in Krishna river valley. The region is known as Palnadu in memory of ancient Pallavas. A series of dynasties such as Ikshvaku, Vishnukundinas, Eastern Chalukyas and later Kakatiyas ruled the region. The war of Palnadu in the 12th century is mark

ed in legend and literature as 'Andhra Kurukshetra War'. The war of Palnadu weakened the power of Vengi Chalukyas and paved way for the emergence of Kakatiyas as a great Telugu dynasty. GURAZALA, MACHERLA, KAREMPUDI these areas mainly comes under Palnadu

అందరికీ దసరా శుభాకాంక్షలు 🕉️ఈ విజయదశమి అందరికీ విజయాలు తీసుకురావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏🏼
12/10/2024

అందరికీ దసరా శుభాకాంక్షలు 🕉️

ఈ విజయదశమి అందరికీ విజయాలు తీసుకురావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏🏼

ఓం గణ గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బొప్పా మోరియా  కోరిన కోరికలు తీర్చే బొజ్జ గణపయ...
07/09/2024

ఓం గణ గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బొప్పా మోరియా కోరిన కోరికలు తీర్చే బొజ్జ గణపయ్య విఘ్నాలు తొలగించే బుచ్చ గణపయ్య మీ జీవితాల్లో విఘ్నాలు తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

విరిగిన మెడ ఎముక, కళ్ల నుంచి కారిన రక్తం, శరీరమంతా నల్లటి మచ్చ, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలోని బహుళ వ్యక్తుల వీర...
16/08/2024

విరిగిన మెడ ఎముక,
కళ్ల నుంచి కారిన రక్తం,
శరీరమంతా నల్లటి మచ్చ,
ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలోని బహుళ వ్యక్తుల వీర్యం 150 ml" ఇది కేవలం ప్రారంభ నివేదిక! నొప్పిని ఊహించగలరా? ఆమె కోసం నిలబడండి!
వీలైతే ఒక షేర్ చేయండి
కనీసం మనిషిలా ఆలోచించండి
ఇది మీ ఇంట్లో అక్కకు చెల్లికో జరిగితే.....????

కనీసం మనిషిలా స్పందించండి..

మొన్న కొలకత్తా లో ఒక పీజీ చేస్తున్న జూనియర్ డాక్టర్ అమ్మాయిని రేప్ చేసి చంపారు. ఆమెని ఎక్కడో ఉంటే చెయ్యలేదు.. ఆమె వర్క్ ...
16/08/2024

మొన్న కొలకత్తా లో ఒక పీజీ చేస్తున్న జూనియర్ డాక్టర్ అమ్మాయిని రేప్ చేసి చంపారు. ఆమెని ఎక్కడో ఉంటే చెయ్యలేదు.. ఆమె వర్క్ ప్లేస్ లో చేశారు. పీజీ అంటేనే చాలా పని ఉంటుంది. ఒక్కో సారి కంటిన్యూ గా 36 గంటలు డ్యూటీ కూడా ఉంటుంది. ఆమెను ఎంత దారుణంగా రేప్ చేసి చంపారో, పోస్టు మార్టం రిపోర్ట్ చదివితే తెలుస్తుంది.

ఆమె రెండు కాళ్ళు 90 డిగ్రీలు అటు ఇటు లాగేసారు..ఈ పని చెయ్యటానికి కనీసం ఇద్దరు కావాలి. స్కల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కళ్లద్దాలు పగిలి, గాజు ముక్కలు కంట్లోకి వెళ్లాయి. పెల్విక్ బోన్ అంటే తుంటెముక విరిగిపోయింది. ఇది కాామ వాంచ కోసం చేసినట్టు లేదు..అత్యంత దారుణంగా హింసిస్తూ , పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన ఘాతుకం. రిపోర్ట్ లో 150 గ్రాముల సెమెన్( వీర్యం) ఉన్నట్టు నిర్ధారించారు. సో ఇది ఒక్కడి పని కాదు..ఖచ్చితంగా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కడే దొరికాడు.

ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే, మమతా బెనర్జీ ప్రభుత్వం అతనికి వెంటనే వేరే పోష్టింగ్ ఇచ్చింది. ఒక్కడినే పట్టుకోవటం వల్ల, కొంత మందిని సేవ్ చేస్తునట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క సారిగా దేశం మొత్తం స్పందించింది. డాక్టర్ల తో పాటు, సామాన్యులు కూడా వాయిస్ వినిపిస్తున్నారు.

అసలు ఇంత దారుణంగా చేసిన వారికి ఈ సమాజం లో ఎక్కడైనా ఒక్క రోజైనా బ్రతికే హక్కు ఉందా??

ఇది కేవలం ప్రారంభ నివేదిక! నొప్పిని ఊహించగలరా? ఆమె కోసం నిలబడండి!🥺

దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నేతలు ఒక్కరు కూడా స్పందించట్లేదు.





రైతులకు అలర్ట్.. #రుణమాఫీ నేపథ్యంలో రైతులకు  #సైబర్ ముప్పు పొంచి ఉందని గుర్తించిన పోలీసులు.. రైతులను అలర్ట్ చేస్తున్నారు...
19/07/2024

రైతులకు అలర్ట్..
#రుణమాఫీ నేపథ్యంలో రైతులకు #సైబర్ ముప్పు పొంచి ఉందని గుర్తించిన పోలీసులు.. రైతులను అలర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నిందితులు రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున.. వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్‌లలో బ్యాంక్ లోగోతో లింక్స్ పంపిస్తున్నారు. ఈ APK లింక్స్‌పై క్లిక్ చేస్తేనే రుణమాఫీ అవుతుందంటూ నమ్మబలుకుతున్నారు. అయితే, ఈ లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దని #పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.
పోలీసుల ప్రకటన..
‘రుణమాఫీపై ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు వస్తుంటాయి. బ్యాంకుల లోగోలు పెట్టుకుని మరీ కొందరు కాల్స్, మెసేజెస్ చేస్తుంటారు. వాటిని రైతులెవరూ నమ్మవొద్దు. ఒకవేళ రైతులు ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతాల్లోంచి డబ్బులు మాయం అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు మెసేజ్ చేసినా.. కాల్ చేసి వివరాలు అడిగినా చెప్పొద్దు’ అని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు.
మోసపోతే వెంటనే ఈ పని చేయండి..
కొందరు తెలియక సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేయడం గానీ.. బ్యాంక్ అధికారులని భావించి తమ ఖాతా వివరాలు చెప్పడం గానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరస్తులు బాధితుల అకౌంట్లను హ్యాక్ చేసి అందులోని డబ్బును దోచేస్తారు. ఎవరైనా రైతులు ఇలా మోసపోతే.. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కి కాల్ చేయాలని, లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. cybercrime.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చని రైతులకు, ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

17/07/2024

అద్భుతం!! 🙏🏾హిందూ సంస్కృతి గొప్పతనాన్ని, వివాహ వేడుకలో కన్యాదానం ప్రాముఖ్యతను ఎంత గొప్పగా నీతా అంబానీ చెప్పిందో చూడండి.👌🏾 అంబానీ ఫ్యామిలీ వద్ద కేవలం డబ్బు, ఐశ్వర్యం మాత్రమే కాదు విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకే తమ కొడుకు వివాహాన్ని ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేస్తూ భారతీయతను, భారతీయ వైవాహిక బంధం గొప్పతనాన్ని చాటారు.

17/07/2024

పల్నాడు జిల్లా.. మాచర్ల నియోజకవర్గం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు త్రాగునీటి ని ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం విడుదల చేశారు.

సాగర్ కుడి కాలువ 5,7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు.

పల్నాడు,గుంటూరు,బాపట్ల,ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామా:-మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్త...
17/07/2024

తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామా:-

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు.

ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు

నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

#ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని #విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

#ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఇది ముఖ్యంగా #రైతుల పండుగ. #ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

#తొలిఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు...

ఇంతింటికథ...త్వష్టప్రజా  పతి కుమార్తె సంజ్ఞాదేవి. ఈమెకే ఉష అని కూడా పేరు. ఈమె సూర్యభగవానుడి భార్య. సూర్యుడి చురుకుదనాన్న...
17/07/2024

ఇంతింటికథ...
త్వష్టప్రజా పతి కుమార్తె సంజ్ఞాదేవి. ఈమెకే ఉష అని కూడా పేరు. ఈమె సూర్యభగవానుడి భార్య. సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకుంది ఉష. కానీ పెళ్లి అయి కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వెలుగు, వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండు సార్లు అడిగిచూసింది. అదితన సహజ లక్షణ మనీ, తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యుడు.
కొంతకాలం ఎలాగో భరించింది. వైవస్వతుడు, యముడు, యమి అనేసంతానం కలిగారు. ఆ తర్వాత ఆమెలో మరల మునుపటిమార్పు వచ్చింది. తన కోసం వెలుగునూ, వేడినీ తగ్గించుకోమని భర్తను అడిగిందామె. ఎప్పటిలాగే తనని సహిస్తూ, సహధర్మచారిణిగా సహజీవనం చేయాలని నచ్చచెప్పాడు సూర్యుడు. సరేనని తలాడించిందామె. అయితే, తనకు ప్రస్తుతం అమ్మానాన్నల మీద మనసు మళ్లిం దనీ, కొంతకాలం అక్కడ గడిపివస్తానని చెప్పి పుట్టిం టికి పయనం కట్టిం దామె. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకూ ఆయనకూ మనస్పర్థలంటూ ఏమీ లేవు పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి కానీ, భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చిందామెకు. ముమ్మూర్తులా తననేపోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టి, తనలాగే ప్రవర్తిస్తూ, తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యే కత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. సంజ్ఞాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్లిం ది. అక్కడొక అడవిలో అశ్వరూపంతో ఉండియథేచ్ఛగా సంచరించసాగింది.
అలా కొంతకాలం గడిచింది. తర్వాత నారద మహర్షి ప్రోద్బలాలతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది. ఫలితంగా ఆమెకి శనైశ్చరుడు, సావర్ణిమనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తిం ది. దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంజ్ఞా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమున లకు తాము తమ తల్లికేసవతి బిడ్డలమనేవిషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్లాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడడటం లేదేమని అడిగాడు. ఛాయ కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రం గా మందలించింది. యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ, యముణ్ణి భయంకరంగా శపించింది.
చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్నతల్లి ఏమిటి, కన్నబిడ్డలను శపించడమేమిటనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదనీ, ఆమె ప్రతి రూపమైన ఛాయననీ, సంజ్ఞాదేవి అజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ.
చిత్రం గా సూర్యభగవానుడికి ఇద్దరిమీదా కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా, సంజ్ఞ తనను వీడివెళ్లిపోయింది... వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసివెళ్లిం ది... అనుకున్నాడు. సంజ్ఞపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి. ఆమెను వెదుక్కుంటూ వెళ్లాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికికుతూహలంగా చూశాడు. ఆ హయమేతన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగ గుర్రం రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది. వారిఅన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలూ, మరొక కుమారుడూ కలిగారు. ఆ కవలలే అశ్వినీ దేవతలుగా... దేవవైద్యులుగా దేవలోకానికిచేరారు. వారిసోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనేఉండిపోయాడు.
తాను ఇంత చేసినా భర్తకు తనపైకోపం రాకపోవడంతో సంజ్ఞకు పతిదేవుడిపై ప్రేమ పుట్టిం ది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికివెళ్లిం ది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్లి, తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్నీ, శక్తి అనే ఆయుధాన్నీ తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికీఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికిఇచ్చింది.
తనకోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం, దానికితోడు ఆయన తనకు తానుగా తన శరీరానికిశీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయాసంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది.
ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి చాలా ఉంది. అదేమిటంటే... కాపురమన్నాక కలతలు, కలహాలు, పొరపచ్ఛాలు సహజం. అయితే, వాటిని పరిష్కరించుకోవడంలోనే మన విజ్ఞత, సమయస్ఫూర్తి బయట పడతాయి. ప్రణయ కలహాలు లేని కాపురం ఉప్పులేని పప్పు వంటిదని పెద్దలు అందుకేఅంటారు కాబోలు. –డి.వి.ఆర్. భాస్కర

తొలి ఏకాదశి , శయన ఏకాదశితొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రామ...
16/07/2024

తొలి ఏకాదశి , శయన ఏకాదశి

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

#తొలి_ఏకాదశి అంటే ఏమిటి
ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి – విశిష్టత
ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

*తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు*

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

*ఉపవాస ఫలితాలు:*

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.

అన్నదానం చేయడం చాలా మంచిది.

*ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.*

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

 #శ్రీవారాహీదేవిధ్యానములు                         శ్రీ వార్తాళి వారాహీ ధ్యానం               చంద్రార్థ చూడాం విమలాం భుజాభ...
14/07/2024

#శ్రీవారాహీదేవిధ్యానములు
శ్రీ వార్తాళి వారాహీ ధ్యానం
చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్ I
సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్ II
శ్రీ బృహద్వారాహీ ధ్యానం
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II

🙏శుభ శుభోదయం🙏

ప్రవచనకర్త  చాగంటి కోటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.గురువుగారు హైందవ ధర్మాలను కాపాడడంలోప్రాణనాడి అయినటువంటి ...
14/07/2024

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

గురువుగారు హైందవ ధర్మాలను కాపాడడంలో
ప్రాణనాడి అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి
సాష్టాంగ ప్రణామములు మీ ప్రవచనములతో ఎంతోమందిని ఉత్తేజపరచి, అంతరించిపోతున్న హైందవ ధర్మాచారాలకు వారధిగా
నిలబడాలని [ నిలబడుతున్నందుకు] మీ ఈ జన్మదినము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
జైశ్రీరామ్

#చాగంటి_కోటేశ్వరరావు

 #హైదరాబాద్‌ లోని ప్రాంతాలు- వాటికి  ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి.A1.* ♨️ బేగం పేట.6వ నిజాం  మహబూబ్  అలీ కు...
13/07/2024

#హైదరాబాద్‌ లోని ప్రాంతాలు- వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి.

A1.* ♨️ బేగం పేట.
6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..
కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదగా బేగంపేట అని పేరు వచ్చింది.

B2. ♨️చార్మినార్
కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు….
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

H3. ♨️సికింద్రాబాద్
మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది . అంతకుముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచే వారు.

I4.♨️ఖైరతాబాద్
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది

N5. ♨️శంషాబాద్
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు.
దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని….
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.!

A6. ♨️నాంపల్లి
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

V7. ♨️హిమయత్ నగర్
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆస‌ఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.

A8. ♨️అబిడ్స్
ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదువ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

S9. ♨️సోమాజిగూడ
నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి .
సోనాజీ కాస్త సోమాజి అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!

A10 . ♨️మాసబ్ ట్యాంక్
6వ కుతుబ్ షాహ్ భార్య హ‌యత్ భ‌క్షిభేగంను మాసాహెబా అని పిలిచేవారు. మాసాహెబా పల్లె భూములకు సాగునీరు ఇవ్వడానికి ఒక ట్యాంక్ నిర్మించింది .
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు . చివరకు ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది .

N11. ♨️హైదరాబాద్
కులీకుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైద్రా నగరం అని అర్ధం తర్వాత ఆ పేరు మీద హైదరాబాద్ గా మారింది .

T12 .♨️మలక్ పేట్
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

H13 . ♨️బషీర్ బాగ్
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది .
ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది . బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్ధం .

O14. ♨️ఫలక్ నుమా:
ఫలక్ అంటే ఆకాశం , నామ అంటే అద్దం . ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది . కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

S15 . ♨️సరూర్ నగర్
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

H16.♨️లంగర్ హౌజ్:
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది.
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

K17.♨️చెంచల్‌ గూడ:
చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

U18.♨️కార్వాన్:
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

M19.♨️కవాడిగూడ:
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

A20.♨️దోమలగూడ:
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

R21. ♨️బేగం బజారు:
హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

K22. ♨️అఫ్జల్ గంజ్:
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

S23.♨️హైదర్ గూడ:
మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

K24.♨️తార్నాక:
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె..
నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
25.♨️శాలిబండ:
శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు.
ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది

26.♨️హబ్సిగూడ:
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.

27.♨️మదీనా:
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

28.♨️చిక్కడపల్లి:
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

29.♨️నౌబత్ పహాడ్:
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

30.♨️బాగ్‌లింగంపల్లి:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.
31.♨️అడిక్‌మెట్:
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

32.♨️మీరాలంమండి:
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!

౩౩.♨️బార్కాస్:
నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.

34.♨️తాడబండ్:
తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.

35.♨️ఎర్రమంజిల్‌:
ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

36.♨️కాచిగూడ:
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.

37.♨️లాడ్‌ బజార్:
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.

38.♨️ముషీరాబాద్:
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

39.♨️ఫతే మైదాన్:
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు.
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

40.♨️పబ్లిక్ గార్డెన్స్:
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్

41.♨️చాదర్ ఘాట్:
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

42.♨️ఆస్మాన్ గఢ్:
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.

43.♨️ఉమ్దా బజార్:
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.

44.♨️గౌలిగూడ:
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

45,♨️లల్లాగూడ:
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది.

46.♨️సుల్తాన్ బజార్: 1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక,
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

47.♨️రికాబ్ గంజ్:
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

48.♨️డబిర్ పురా:
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

49.♨️అంబర్‌ పేట:
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

50.♨️చాంద్రాయణగుట్ట:
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
🄺🄷🄰🄳🄸🅁
51.♨️చిలకలగూడ:
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!

52.♨️మంగళ్ హాట్:
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

53. ♨️సైదాబాద్:
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

54.♨️టప్పాచబుత్ర:
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

55.♨️తుకారాం గేట్:
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.
ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

56,♨️యాఖుత్ పురా:
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు...

మీ🤝🙏

భారతకాలంలోని మహారథుల్లో  #అశ్వత్థామ. ఒకరు. మహా భారతం గురించి ప్రస్తావించేటప్పుడు పెద్దగా చర్చకురాని, మరుగున పడిన పాత్రల్...
12/07/2024

భారతకాలంలోని మహారథుల్లో #అశ్వత్థామ. ఒకరు.
మహా భారతం గురించి ప్రస్తావించేటప్పుడు పెద్దగా చర్చకురాని, మరుగున పడిన పాత్రల్లో ఒకరు... అశ్వత్థామ. ఇటీవల ‘కల్కి’ సినిమాతో ఆ పాత్ర సర్వత్రా చర్చనీయాంశమయింది. అశ్వత్థామ ఎంతటి యోధుడో, అతని స్వభావం ఎలాంటిదో మహాభారతంలో... వివిధ సందర్భాల్లో వ్యాసుడు వివరించాడు. అతని తండ్రి ద్రోణుడు, రాజైన ద్రుపదుడు సహాధ్యాయులు.
అశ్వత్థామ పుట్టిన తరువాత... కుటుంబ పోషణ కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్ళిన ద్రోణుడికి అవమానం జరిగింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కురు రాజులను ద్రోణుడు ఆశ్రయించి... పాండవులకు, కౌరవులకు శస్త్రాస్త్ర విద్యల్లో శిక్షణ ఇచ్చాడు. అశ్వత్థామ కూడా తండ్రి దగ్గర విద్యలు నేర్చి మహా వీరుడయ్యాడు. భారతకాలంలోని మహారథుల్లో అతనొకడు.
#మహారథి అంటే 60వేల మందితో పోరాడగలిగే శక్తి కలిగినవాడు. అయితే పాండవులన్నా, #శ్రీకృష్ణుడన్నా అతనికి ఈర్ష్య. తను మహావీరుడిననీ, #శివుడి నుంచి వరం పొందినవాడిననీ, దివ్యాస్త్ర సంపన్నుడిననీ అహంకారం. #పాండవులను సమూలంగా రూపుమాపాలని ప్రయత్నించిన అతను శాపగ్రస్తుడిగా మిగిలిపోవడానికి దారితీసిన ఘట్టాలు... #మహాభారతంలోని ‘సౌప్తిక పర్వం’లో కనిపిస్తాయి.
మహా భారత యుద్ధంలో తను మరణించినట్టు మభ్యపెట్టి... తన తండ్రిని పాండవులు వధించడంతో #అశ్వత్థామ ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిద్రిస్తున్న ద్రౌపది కుమారులైన అయిదుగురు ఉపపాండవులను, #ద్రోణుణ్ణి చంపిన దుష్టద్యుమ్నుణ్ణి సంహరించాడు. ఇది విన్న #ద్రౌపది... #భీముణ్ణి పంపించి అశ్వత్థామను చంపించకపోతే ప్రాయోప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ‘‘అశ్వత్థామ అడవులు పట్టిపోయి ఉంటాడు. అతణ్ణి చంపినట్టు నిదర్శనం ఏమిటి?’’ అని అడిగాడు ధర్మరాజు. ‘‘అతని శిరస్సుపైన సహజమైన రత్నం ఉంది. దాన్ని తెస్తేనే నేను బతుకుతాను’’ అంది ద్రౌపది.
అశ్వత్థామ సంహారానికి భీముడు, అతని రథ సారథిగా నకులుడు బయలుదేరారు. కురుక్షేత్రం దగ్గర ఆగి... ‘‘అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలుసా?’’ అని అక్కడివారిని అడిగారు. ‘‘అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు’’ అని వారు చెప్పారు. ఈలోగా ధర్మరాజును కలవడానికి వచ్చిన శ్రీకృష్ణుడికి విషయం తెలిసింది.
అప్పుడు కృష్ణుడు ‘‘ధర్మరాజా! భీముడు ఒక్కడే వెళ్ళాడా? అది ప్రమాదం. మనం కూడా వెళ్ళడం మంచిది. ఎందుకంటే... అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది. పుత్రవాత్సల్యంతో దాన్ని ద్రోణుడు అతనికి ఇచ్చాడు. అయితే అశ్వత్థామది కోపిష్టి స్వభావం అని ఆయనకు తెలుసు. కాబట్టి... ఎప్పుడైనా పాండవులమీద దాన్ని ప్రయోగిస్తాడని అనుమానపడ్డాడు.
అందుకే అర్జునుడికి కూడా ఆ అస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే అర్జునుడంటే అశ్వత్థామకు ఈర్ష్య. ఆ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగిస్తే ఎన్నో విపత్తులు కలుగుతాయి. కాబట్టి ‘‘ఎన్ని ఆపదలు ఎదురైనా... వేరే విధంగా తప్పించుకోవాలి తప్ప దీన్ని మాత్రం ప్రయోగించకు’’ అని అశ్వత్థామకు ద్రోణుడు చెప్పాడు. కానీ ఆ మాటలు అతని చెవికెక్కలేదు. అంతేకాదు.. శివుడి వరం వల్ల తనకు మరణం లేదనీ, తన దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందనీ, దాంతో ముల్లోకాలనూ కాల్చి బూడిద చెయ్యగలననీ అతనికి అహంకారం.
మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు... ఒకసారి నా దగ్గరకు అశ్వత్థామ వచ్చాడు. ‘‘ఈ అస్త్రాన్ని నా తండ్రి తపస్సుకు మెచ్చి అగస్త్య మహాముని ఇచ్చాడు. దీన్ని తీసుకొని... నాకు నీ సుదర్శన చక్రం ఇవ్వు’’ అని అడిగాడు. అతని మనసులోని ఉద్దేశం నాకు అర్థమయింది. నా చక్రం, కత్తి, గద చూపించి... ‘‘నువ్వు నీకు ఏది కావాలంటే అది తీసుకో. బదులుగా నువ్వు నాకు ఆ అస్త్రాన్ని ఇవ్వక్కర్లేదు.
ఎందుకంటే స్నేహితుడికి ఏదైనా ఇచ్చినప్పుడు బదులుగా మరొకటి తీసుకోకూడదు’’ అన్నాను. అశ్వత్థామ సంతోషంతో సుదర్శన చక్రాన్ని ఎడమ చేతితో ఎత్తబోయాడు, కుదరలేదు కుడిచేత్తోనూ కదిలించలేకపోయాడు. తన బలమంతా ఉపయోగించి రెండు చేతులతో ప్రయత్నించాడు. కానీ ఎత్తలేక... అలిసిపోయాడు. ‘‘నేను పన్నెండేళ్ళు హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేసి దీన్ని సంపాదించాను. దీన్ని ఎవ్వరూ... ఆఖరికి అర్జునుడు కూడా కావాలని అడగలేదు. నువ్వు అడిగావు.
ఇంతకీ దీంతో ఎవరిమీద యుద్ధం చేస్తావు?’’ అని అశ్వత్థామను అడిగాను. ‘‘నువ్వు చక్రం ఇస్తే... నిన్ను బతిమాలైనా నీతోనే యుద్ధం చేద్దామనుకున్నాను. అయితే ఈ చక్రం ధరించడానికి నువ్వే తగినవాడివి. ఇది లేకపోయినా నాకు నష్టమేం లేదు. నీతో యుద్ధం చెయ్యడానికి నా దగ్గర ఉన్న మహా అస్త్రాలు చాలు’’ అన్నాడు. అతనిలో అంత మహా అహంకారానికి కారణం... బ్రహ్మశిరోనామకాస్త్రం. అతను అధర్మ ప్రవర్తకుడు. క్రూరకర్మలు చేసేవాడు. భీముడికి ఏమైనా కావచ్చు’’ అంటూ ధర్మరాజు, అర్జునులతో కలిసి బయలుదేరాడు శ్రీకృష్ణుడు.
వ్యాసుడి ఆశ్రమానికి ఉద్రేకంగా వెళ్తున్న భీముణ్ణి వాళ్లు చూశారు. వాళ్ళు ఆగమన్నా భీముడు ఆగలేదు. ఆశ్రమంలో ఒక చోట... అశ్వత్థామ తపస్సులో ఉన్నాడు. పెద్దగా అరుస్తూ తనవైపు వస్తున్న భీముణ్ణి, అతని వెనకు అర్జునుణ్ణి, ధర్మరాజును చూశాడు అశ్వత్థామ. అంతకుముందు రాత్రి తాను చేసిన ఘోరాలు గుర్తుకువచ్చాయి. అతనిలో అధైర్యం మొదలైంది. వెంటనే రెల్లు పరక తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని దానిలో ఆవహింపజేశాడు. ‘అపాండవం కావాలి’ అనుకుంటూ ప్రయోగించాడు. ఆ బాణంలోంచి పుట్టిన మహాగ్ని... అన్ని దిక్కులకూ మహోగ్రంగా విజృంభించింది.
ఇది చూసిన కృష్ణుడు ‘‘అర్జునా! అది మరో అస్త్రంతో ఆగదు. నువ్వు కూడా ఆ అస్త్రాన్నే ప్రయోగించు. నిన్నూ, నీ సోదరులనూ రక్షించుకో’’ అన్నాడు.
అర్జునుడు తన గురువైన ద్రోణుణ్ణి స్మరించి... అస్త్రాన్ని అస్త్రం హతమార్చాలి అనుకుంటూ ప్రయోగించాడు. అది వెళ్ళి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని ఢీకొన్నాయి. దీంతో మూడు లోకాల్లో అల్లకల్లోలం చెలరేగింది. జరగబోయే మహోత్పాతాన్ని గుర్తించిన నారదుడు... వ్యాసాశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడితో కలిసి అర్జునుణ్ణీ, అశ్వత్థామను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ‘‘ఈ భూమి మీద ఎందరో వీరులు పుట్టారు, మరణించారు. మనుషుల మీద ఎవరైనా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించారా?’’ అని మునులిద్దరూ ప్రశ్నించారు.
అప్పుడు అర్జునుడు ‘‘అస్త్రంతో అస్త్రాన్ని శాంతింపజేయడం కోసం... మరో మార్గం లేక దీన్ని ప్రయోగించాను. మీరు కోరితే ఉపసంహరిస్తాను. కానీ అతను మమ్మల్ని దహించేస్తాడు. మా క్షేమం మీరే చూడాలి’’ అంటూ అస్త్రాన్ని ఉపసంహరించాడు. నిజానికి ఆ అస్త్రాన్ని ప్రయోగించాక.... ఉపసంహరించడం దేవతల వల్ల కూడా కాదు. అలా ఉపసంహరించినవాళ్ళను అది చంపుతుంది. కానీ గురుభక్తి, తపశ్శక్తి కలిగినవాడు, దానగుణం, సత్యశీలత ఉన్నవాడు కాబట్టి అర్జునుడు ఆ పని చేయగలిగాడు. అది చూసిన మునులు ఆశ్చర్యపోయారు.
అశ్వత్థామ కూడా ఉపసంహరించబోయాడు. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు వ్యాసుడితో... ‘‘భీముడు అధర్మ యుద్ధంలో దుర్యోధనుణ్ణి చంపాడు. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చాడు. ఆ ఆగ్రహంతో... ప్రాణభయంతో నాకు మతిపోయి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. అది పాండవ సంతతినంతటినీ తుడిచిపెట్టేస్తుంది. అది పాపమైనా సరే నేను భరిస్తాను’’ అన్నాడు అశ్వత్థామ.
‘‘శిష్యుడనే వాత్సల్యంతో అర్జునుడికి నీ తండ్రి ఆ అస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని నీకు హాని కలిగించడం కోసం కాకుండా... నీ అస్త్రం ఉపశమించేలా చెయ్యడానికే అర్జునుడు ప్రయోగించాడు. మేము వద్దని చెప్పగానే ఉపసంహరించాడు. ఈ మహాస్త్రాన్ని మనుషుల మీదకు ప్రయోగించినవారికి కీడు తప్పదు. ఇప్పుడు నీ అస్త్రం అతని అస్త్రంతో అణగారిపోతుంది. అది జరిగిన దేశంలో పన్నెండేళ్ళు వానలు పడవు. కాబట్టి దాన్ని అలాగైనా ఉపసంహరించు. నీ శిరోరత్నాన్ని అర్జునుడికి ఇవ్వు. ఇదే సంధి మార్గం’’ అని హితవు చెప్పాడు వ్యాసుడు.
‘‘కౌరవుల సంపద అంతటినీ లాక్కున్న పాండవులకు రత్నాలకు కరువా? ఈ రత్నం ఉంటే దేవ రాక్షసులు, జంతువులు, చోరుల భయం ఉండదు. ఆకలి, దాహం, నిద్ర, అనారోగ్యాలు బాధించవు. అలాంటి రత్నం వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి? కానీ నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి ఇచ్చేస్తాను. కానీ నా అస్త్రం మాత్రం పాండవ స్త్రీల గర్భాలను నాశనం చేసి కాని శాంతించదు’’ అన్నాడు అశ్వత్థామ.
‘‘అలాగే... అయితే మరో దానికి మాత్రం ఆశపడకు’’ అన్నాడు వ్యాసుడు.
ఆయన మాటల్లోని అర్థాన్ని అశ్వత్థామ గ్రహించాడు. ‘అది మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? అన్నిటినీ అంతం చేస్తాను’ అని మనసులో అనుకున్నాడు. కానీ ‘‘అలాగే చేస్తాను’’ అని వ్యాసుడితో చెప్పాడు.
కృష్ణుడికి విషయం అర్థమయింది. ‘వ్యాసుడికి మాట ఇచ్చినట్టే ఇచ్చి.. తనకు నచ్చినట్టు చేస్తాడు. దీన్ని నేను ఆపుతాను’ అనుకున్నాడు మనసులో. ‘‘పాండవుల సంతతిని నాశనం చేసి పాపానికి ఒడిగడుతున్నావు. గర్భాలన్నీ నాశనం చేస్తున్నావు. వాళ్ళకు ఒక్క వంశాంకురాన్నైనా మిగుల్చు. ఆ ఒక్క గర్భాన్ని నీ అస్త్రంతో నాశనం కాకుండా ఆపు’’ అన్నాడు అశ్వత్థామతో.
‘‘ఉత్తర గర్భాన్ని కాపాడాలని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. నేను మాత్రం వదిలిపెట్టను’’ అని స్పష్టం చేశాడు అశ్వత్థామ.
‘‘నువ్వు నాశనం చేసినా నేను రక్షించి, దీర్ఘాయువు పోస్తాను’’ అన్నాడు కృష్ణుడు.
‘‘అస్త్రంతో తగలబడిపోయేవాణ్ణి బతికిస్తానంటున్నావ్‌. నువ్వెంత నేర్పరివో చూద్దాం’’ అంటూ ‘పాండవ స్త్రీల గర్భాలన్నీ నాశనం కావాలి’ అని అనుకొని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని వదిలిపెట్టాడు.
‘‘నీ కళ్ళముందే ఆ బిడ్డ, అతని వంశం కళకళలాడుతూ ఉంటుంది. నేను ఆ బిడ్డని రక్షిస్తాను. నిన్ను మాత్రం... గర్భంలో ఉన్న పిల్లల్ని చంపిన పాపం కట్టికుదుపుతుంది. తిండిలేక అల్లాడతావు. దుర్వాసనతో ఉండే రక్తాన్ని శరీరానికి పూసుకొని మూడువేల ఏళ్ళు దేవులాడుతూ ఉంటావు’’ అంటూ శ్రీకృష్ణుడు శపించాడు.
వ్యాసుడు కూడా అశ్వత్థామకు శాపం ఇస్తూ... ‘‘ఇంతటి పాతకానికి పాల్పడ్డావు. నా మాటను లెక్క చెయ్యలేదు. తిండీ తిప్పలు లేకుండా, ఎటువంటి సహాయం లేకుండా... మూడు వేల ఏళ్ళు దుర్గంధమైన రక్తంతో భూమి మీద తచ్చాడుతూ ఉంటావు’’ అన్నాడు.
‘‘నువ్వూ చిరంజీవివే. మనుషులలోనే ఉంటావు.
నేను నీ దగ్గరే ఉంటాను...’’ అని వ్యాసుడికి చెబుతూ...
తన శిరోరత్నాన్ని పాండవులకు ఇచ్చేసి, తపోవనంలోకి నడిచాడు అశ్వత్థామ. గత యుగాల నుంచి భూమిమీద ఇప్పటికీ మిగిలి ఉన్న ‘చిరంజీవులు’గా పురాణాలు వర్ణించిన వారిలో అశ్వత్థామ ఒకరు. వారిలో శాపగ్రస్తుడు మాత్రం అతనొక్కడే.

#అశ్వత్థామ , , , , , , , , , , , ,

Address


Alerts

Be the first to know and let us send you an email when Palnaduinfo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Convenience Store?

Share